అడివిశేష్ హీరోగా నటించిన "గూఢచారి" 2018లో విడుదలై సూపర్ హిట్ ఐన విషయం తెలిసిందే. ఈ సక్సెస్ఫుల్ వెంచర్ కు మేకర్స్ తాజాగా సీక్వెల్ "గూఢచారి 2/ G 2" ను తెరకెక్కించబోతున్నారు. ఈ నేపథ్యంలో G 2 నిర్మాణంలో మొదటి మెట్టుగా ఈ రోజు ఫస్ట్ లుక్ అండ్ ప్రీ విజన్ వీడియోను విడుదల చేసారు. ముంబైలో జరిగిన ఒక గ్రాండ్ ఈవెంట్ లో జి 2 ఫస్ట్ లుక్ అండ్ ప్రీ రిలీజ్ వీడియో విడుదల అయ్యాయి. ఈ ఈవెంట్ కు చిత్ర నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్, హీరో అడివిశేష్, డైరెక్టర్ వినయ్ కుమార్ సిరిగినీడి తదితరులు హాజరయ్యారు. ఈ ఈవెంట్ కు సంబంధించిన పిక్స్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
అతి త్వరలోనే జి 2 పట్టాలెక్కబోతుందని మేకర్స్ ఎనౌన్స్ చేసారు. అంతేకాక ఈసారి గూఢచారి 116 ఇంటర్నేషనల్ లెవెల్ ఇష్యూస్ ను సాల్వ్ చెయ్యబోతున్న నేపథ్యంలో పాన్ ఇండియా భాషల్లో జి 2 విడుదల చెయ్యబోతున్నట్టు మేకర్స్ తెలిపారు.
పోతే, రేపు జి 2 ఫస్ట్ లుక్ అండ్ ప్రీ విజన్ వీడియో రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa