మెగాస్టార్ చిరంజీవి గారు, మాస్ రాజా రవితేజ గారు చాన్నాళ్ల తరవాత కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న చిత్రం "వాల్తేరు వీరయ్య". మొన్న ఈ మూవీ ట్రైలర్ విడుదల కాగా దానికి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల నుండి ఊరమాస్ రెస్పాన్స్ వస్తుంది. ప్రేక్షకాభిమానుల థండరింగ్ రెస్పాన్స్ తో వాల్తేరు వీరయ్య 14 మిలియన్ వ్యూస్, 500కే లైక్స్ తో #1 పొజిషన్ కైవసం చేసుకుని, యూట్యూబ్ రారాజుగా దూసుకుపోతున్నారు.
బాబీ కొల్లి డైరెక్షన్లో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో శ్రుతిహాసన్, క్యాథెరిన్ ట్రెసా హీరోయిన్లుగా నటించగా, బాబీ సింహ, ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, శ్రీనివాస రెడ్డి, సప్తగిరి, షకలక శంకర్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa