ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అఫీషియల్ : ఒంగోల్లో 'వీరసింహారెడ్డి' ప్రీ రిలీజ్ ఈవెంట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 03, 2023, 10:46 PM

అనుకున్నదే జరిగింది.. బాలకృష్ణ నటిస్తున్న "వీరసింహారెడ్డి" కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోల్లో జనవరి 6వ తేదీన జరగబోతుందంటూ జరిగిన ప్రచారం.. నిజమేనని అధికారికంగా ప్రకటిస్తూ కొంతసేపటి క్రితమే మేకర్స్ అఫీషియల్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ మేరకు ఒంగోల్లో వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన పనులు ఎంతవేగంగా జరుగుతున్నాయో చూపిస్తూ చిన్న వీడియోను కూడా మేకర్స్ విడుదల చేసారు. మరి, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే ట్రైలర్ కూడా విడుదల కాబోతుందని జరుగుతున్న ప్రచారంపై మేకర్స్ నుండి అఫీషియల్ క్లారిటీ రావలసి ఉంది.


గోపీచంద్ మలినేని డైరెక్షన్లో బాలకృష్ణ, శ్రుతిహాసన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లకు రాబోతుంది.   






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa