దినేష్ తేజ్, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న సినిమా 'అలా నిన్నుచేరి'. ఈ సినిమాకు కథ - స్క్రీన్ ప్లే- డైలాగ్స్ - డైరెక్షన్ -మారేష్ శివన్ అందించారు. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై కొమ్మలపాటి సాయి సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కొమ్మలపాటి శ్రీధర్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
ఈ మూవీని ఎనౌన్స్ చేస్తూ మేకర్స్ ఒక అందమైన మోషన్ పోస్టర్ ను విడుదల చేసారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. సుభాష్ ఆనందన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో పాయల్ రాధాకృష్ణ, శివకుమార్ రామచంద్రవరపు, రంగస్థలం మహేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa