టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేసేందుకు ఎంతోకాలం నుండి ఎదురుచూస్తున్నారు. వీరిద్దరి కలయికలో గబ్బర్ సింగ్ సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. దీంతో ఈ కాంబోపై ఆడియన్స్ లో భీభత్సమైన అంచనాలు ఏర్పడ్డాయి. కానీ, ఈ ప్రాజెక్ట్ పై ప్రేక్షకాభిమానుల్లో చాలా సందేహాలు నెలకొన్నాయి.
భవదీయుడు భగత్ సింగ్ కాస్తా ఉస్తాద్ భగత్ సింగ్ గా మారడం, హీరోయిన్ పూజా హెగ్డే పై క్లారిటీ లేకపోవడం, హరిహర వీరమల్లు తదుపరి ఈ సినిమా ఉంటుందా? లేదా?.. ఇలా ఇంకెన్నో.. ప్రశ్నలకి ఆడియన్స్ జవాబు కోరుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో హరీష్ శంకర్ తన నెక్స్ట్ మూవీగా కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ తో సినిమా చేయబోతున్నాడన్న వార్త లేటెస్ట్ గా బయటకు వచ్చింది. దీంతో పవన్ - హరీష్ ప్రాజెక్ట్ పై అభిమానుల్లో మరింత కన్ఫ్యూషన్ నెలకొంది. మరి, హరీష్ - శివ కార్తికేయన్ సినిమాపై నిజానిజాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa