ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'వరిసు' ఆడియో లాంచ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా సీఎం స్టాలిన్‌?

cinema |  Suryaa Desk  | Published : Sat, Dec 24, 2022, 04:09 PM

తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయనున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'వారసుడు' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా వెంకటేష్ బ్లాక్ బస్టర్ చిత్రం సంక్రాంతి తరహాలో ఉండనుంది అని లేటెస్ట్ టాక్.


ఈరోజు చెన్నైలో గ్రాండ్ గా ఈ సినిమా ఆడియో లాంచ్ జరగనుంది. ఈ ఈవెంట్ కు విజయ్ తో పాటు మరికొందరు ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా రావాల్సిందిగా తమిళనాడు సీఎం స్టాలిన్‌ని దిల్ రాజు ఆహ్వానించినట్లు సమాచారం.

ఈ సినిమాలో విజయ్ సరసన కన్నడ బ్యూటీ రష్మిక జంటగా నటిస్తుంది. ప్రభు, ప్రకాష్ రాజ్, జయసుధ మరియు శరత్ కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రలుపోషిస్తున్నారు. ఈ సినిమాకి సెన్సషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు అండ్ శిరీష్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ఈ సినిమాని నిర్మించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa