తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తమిళహీరో విజయ్ నటిస్తున్న సినిమా "వారిసు". తెలుగులో "వారసుడు" టైటిల్ తో విడుదల కాబోతుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తుంది.
వారసుడు సినిమాపై వినిపిస్తున్న తాజా బజ్ ప్రకారం, సుదీర్ఘ నిడివితో ఈ సినిమా థియేటర్లకు రాబోతున్నట్టు తెలుస్తుంది. వారసుడు ఫైనల్ కట్ రన్ టైం వచ్చేసి 2 గంటల 43 నిమిషాలని ప్రచారం జరుగుతుంది. చెప్పాలంటే, ఒక కమర్షియల్ సినిమాలకు ఇంత రన్ టైం అంటే... కొంచెం ఎక్కువ అనే చెప్పాలి. మరి, మేకర్స్ వారసుడుని మరింత ట్రిమ్ చేసి, డీసెంట్ రన్ టైం తో విడుదల చేస్తారా? లేక ఈ రన్ టైం నే ఫైనలైజ్ చేస్తారా..? అన్నది తెలియాల్సి ఉంది.
పోతే, ఈ రోజు చెన్నైలో వారిసు గ్రాండ్ ఆడియో లాంచ్ ఈవెంట్ జరగబోతుంది. పొంగల్ 2023 కానుకగా తమిళ, తెలుగు భాషలలో ఒకేసారి విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa