నటసింహం నందమూరి బాలకృష్ణ గారు నటిస్తున్న న్యూ మూవీ "వీరసింహారెడ్డి" నుండి తాజాగా స్పెషల్ సాంగ్ 'మా బావ మనోభావాలు' ప్రోమో విడుదలయ్యింది. ఫుల్ సాంగ్ ఈ రోజు మధ్యాహ్నం 03:19 నిమిషాలకు రిలీజ్ కానుంది. మా బావ మనోభావాల్ దెబ్బతిన్నాయి ...అని సాగే ఈ ప్రోమో పెప్పీ మాస్ ట్యూన్ తో ఫుల్ సాంగ్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అనే క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో కలుగజేసింది.
గోపీచంద్ మలినేని డైరెక్షన్లో బాలకృష్ణ, శ్రుతిహాసన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa