ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"సలార్"పై సెన్సేషనల్ విషయాలను వెల్లడించిన విజయ్ కిరంగదుర్

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 23, 2022, 07:08 PM

ఇద్దరు పాన్ ఇండియా సెలెబ్రిటీల కలయికలో రాబోతున్న సినిమా "సలార్". కేజీఫ్ తో సెన్సేషన్ సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తో తీస్తున్న ఔటండౌట్ యాక్షన్ ఎంటర్టైనర్ ఈ సినిమా. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరంగదుర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు.


తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో విజయ్ కిరంగదుర్ మాట్లాడుతూ.. సలార్ గురించిన ఆసక్తికర విషయాలను వెల్లడించి..డార్లింగ్ ఫ్యాన్స్ లో ఫుల్ ఖుషి నింపారు. సలార్ మూవీ ఇప్పటివరకు 85% షూటింగ్ పూర్తి చేసుకుందని, జనవరి కల్లా మిగిలిన షూటింగ్ ను కూడా పూర్తి చేస్తామని చెప్పారు. ఆపై VFX, ప్రమోషన్స్ సైమల్టేనియస్ గా జరిపి సెప్టెంబర్ 28 వ తేదీన పాన్ ఇండియా భాషల్లో సలార్ విడుదలకు సిద్ధం చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సలార్ కి సీక్వెల్స్ ఉండే ఛాన్స్ ఖచ్చితంగా ఉందని తెలిపారు.  ప్రస్తుతం ఈ సెన్సేషనల్ రివీలేషన్స్ తెలుసుకున్న డార్లింగ్ అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బి బ్బవుతున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa