కిరణ్ అబ్బవరం, కాశ్మీర పరదేశీ జంటగా నటించిన సినిమా "వినరో భాగ్యము విష్ణుకథ". మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్షన్లో ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా నుండి రేపు ఫస్ట్ సింగిల్ విడుదల కాబోతుంది. ఈ మేరకు విడుదలైన ప్రోమో డివోషనల్ వైబ్స్ తో శ్రోతలను ఆకట్టుకోగా పూర్తి పాట కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో లెజెండరీ నటులు కే. విశ్వనాధ్ గారు రేపు సాయంత్రం 06:19 నిమిషాలకు వినరో భాగ్యము విష్ణుకథ నుండి 'వాసవ సుహాస' అనే పాటను లాంచ్ చెయ్యనున్నారు. చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ గారు సమర్పిస్తున్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa