ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధనుష్ "వాతి" సెకండ్ సింగిల్ పై లేటెస్ట్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 23, 2022, 06:21 PM

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న తొలి ద్విభాషా చిత్రం "వాతి". తెలుగులో "సార్". వెంకీ అట్లూరి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 2న గ్రాండ్ రిలీజ్ కావాల్సి ఉండగా, వచ్చే ఏడాది ఫిబ్రవరి 17కి వాయిదా పడిన విషయం తెలిసిందే. సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.


రీసెంట్గా ఈ సినిమా నుండి ఫస్ట్ లిరికల్ 'వా వాతి / మాస్టారూ ..మాస్టారూ' సాంగ్ విడుదలై, ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా నుండి సెకండ్ సింగిల్ అతి త్వరలోనే విడుదల కాబోతుందని తెలుస్తుంది. ఈ మేరకు తమిళంలో 'నాదోడి మన్నన్' టైటిల్ తో ఈ పాట రాబోతుందని తెలుస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa