కోలీవుడ్ స్టార్ హీరో తాలా అజిత్ నుండి రాబోతున్న సరికొత్త చిత్రం "తునివు". ఇందులో మంజు వారియర్, సముద్రఖని కీలకపాత్రల్లో నటిస్తున్నారు. H. వినోద్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుండి రెండు లిరికల్ సాంగ్స్ విడుదలై శ్రోతలను అలరిస్తుండగా, తాజాగా మేకర్స్ థర్డ్ సింగిల్ ను రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసారు. ఈ మేరకు డిసెంబర్ 25న తునివు థర్డ్ సింగిల్ 'గ్యాంగ్స్టా' విడుదల కాబోతుంది.
బోనీ కపూర్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగులో "తెగింపు" టైటిల్ తో రాబోతుంది. తెలుగు, తమిళ భాషలలో పొంగల్ 2023 కి విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa