ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధమ్కీ : ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా వీడియో సాంగ్ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 23, 2022, 11:40 AM

రీసెంట్గా విడుదలైన ధమ్కీ ఫస్ట్ లిరికల్ ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా పాటకు శ్రోతల నుండి వస్తున్న విశేష స్పందన కారణంగా మేకర్స్ ఈ పాట పూర్తి వీడియోను కొంతసేపటి క్రితమే విడుదల చేసారు. లియోన్ జేమ్స్ అందించిన పెప్పీ ట్యూన్ కు సింగర్ ఆదిత్య RK మెలోడియస్ వాయిస్ తోడవ్వడంతో ఈ బీచ్ ఛిల్లింగ్ సాంగ్ ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. అలానే యష్ మాస్టర్ అందించిన కొరియోగ్రఫీ సూపర్బ్ గా ఉంది. పూర్ణాచారి లిరిక్స్ క్యాచీ గా ఉన్నాయి.


విశ్వక్ సేన్ డైరెక్ట్ చేసి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుంది. వణ్మయి క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


ఇంకా ఈ సినిమాలో రావురమేష్, తరుణ్ భాస్కర్, అక్షర గౌడ్, రోహిణి, పృథ్విరాజ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 17, 2023లో విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa