షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న సినిమా "పఠాన్". సిద్దార్ధ్ ఆనంద్ డైరెక్షన్లో పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో జాన్ అబ్రహం కీరోల్ లో నటిస్తున్నారు. విశాల్ శేఖర్ సంగీతం అందించారు.
రీసెంట్గానే ఈ సినిమా నుండి బేషరం రంగ్ అనే వీడియో సాంగ్ విడుదలై ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. అలానే ఈ సాంగ్ పై కొంతమంది అసంతృప్తిని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం పక్కన పెడితే, తాజాగా పఠాన్ నుండి సెకండ్ సింగిల్ రావడానికి రెడీ అవుతుందని తెలుస్తుంది. జూమ్ జో పఠాన్ అనే సాంగ్ డిసెంబర్ 22న రాబోతుందని తెలుస్తుంది.
పోతే, ఈ సినిమా జనవరి 25, 2023లో హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa