పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మరొక పాన్ ఇండియా చిత్రం ''సలార్''. కెజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో పక్కా మాస్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ కీరోల్ లో నటిస్తున్నారు. విలక్షణ నటుడు జగపతి బాబు ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు.
సలార్ న్యూ షెడ్యూల్ జనవరి, 2023లో స్టార్ట్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో పృథ్విరాజ్ మాట్లాడుతూ... సలార్ నెక్స్ట్ న్యూ షెడ్యూల్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. జనవరిలో స్టార్ట్ కాబోయే సలార్ న్యూ షెడ్యూల్ ఇటలీలో జరగబోతుందని, ఆ షెడ్యూల్ లో ప్రభాస్, తాను మాత్రమే పాల్గొంటామని చెప్పారు. వీరిద్దరి రోల్స్ సినిమాలో.. హీరోగా, విలన్గా కాకుండా... అంతకుమించి అన్నట్టు ఉంటుందట ..
రవి బస్రుర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తుంది. పోతే, ఈ సినిమా వచ్చే ఏడాది సెప్టెంబర్ 28వ తేదీన పాన్ ఇండియా భాషల్లో విడుదల కావడానికి రెడీ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa