టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమైన హీరో ఆది పినిశెట్టి. హీరో, సపోర్టింగ్, విలన్... ఇలా ఏ రోల్ లో ఐనా తనదైన విలక్షణ నటనను ప్రదర్శించి, ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నారు. రీసెంట్గానే శబ్దం అనే పాన్ ఇండియా ప్రాజెక్టును ఎనౌన్స్ చేసి, ఆ మూవీ షూటింగ్ లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు.
ఆది పినిశెట్టి నటించిన హిట్ సినిమాలలో 'మరగద నానయం' తెలుగులో 'మరకతమణి' ఒకటి. ఆ సినిమాకు సీక్వెల్ చెయ్యమని కోరుతూ ఒక నెటిజన్ ఆదిని అడగ్గా, అందుకు ఆది నుండి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. నేను కూడా ఆ సినిమాకు సీక్వెల్ చేసేందుకు ఎదురుచూస్తున్నాను... అంటూ ఆది రిప్లై ఇవ్వడంతో... ఇప్పుడంతా ఈ సినిమా సీక్వెల్ ఎనౌన్స్మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. 2017లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆర్క్ శరవణన్ డైరెక్షన్లో హార్రర్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి భార్య, హీరోయిన్ నిక్కీ గల్రాని ఫిమేల్ లీడ్ లో నటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa