పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతితో ఒక సినిమాను చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తుంది. మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా హార్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతుందట. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన అన్ని విషయాలు కూడా ప్రచారంలో ఉన్న వార్తలే. ఏ ఒక్క విషయంపై మేకర్స్ నుండి అఫీషియల్ అప్డేట్ రాలేదు. తాజాగా ఈ మూవీ న్యూ షెడ్యూల్ ఈ వారంలోనే ప్రారంభం కానుందని తెలుస్తుంది. ఇప్పటికి 8రోజుల షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 24 నుండి న్యూ షెడ్యూల్ ను జరుపుకోబోతుందట. మరి, ఈ షెడ్యూల్ లో ప్రభాస్ పాల్గొంటున్నారా..? లేదా ..? అన్నది తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa