బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' మూవీని రూపొందిస్తున్న విషయం తెలిసిందే కదా. ఈ సినిమాకు రచయిత - డైరెక్టర్ - నిర్మాత ..కంగనానే. ఈ సినిమాలో కంగనా ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరా గాంధీ పాత్రలో నటిస్తుంది. ఈ మేరకు విడుదలైన కంగనా ఫస్ట్ లుక్ పోస్టర్ కు ఆడియన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
భారతదేశ చరిత్రలో చీకటి రోజులైన ఎమర్జెన్సీ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈ కారణంగా ఇండియన్ పార్లమెంట్ లో ఎమర్జెన్సీ షూటింగ్ జరుపుకునేందుకు అనుమతిని కోరుతూ కంగనా కేంద్రానికి లేఖ రాసిందని బాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం. నిజానికి, పార్లమెంట్ లో ఏ ప్రైవేట్ పర్సన్ అడుగుపెట్టడానికి కూడా వీలు లేదు. ఇక షూటింగ్ అంటే.. రూల్స్ కి విరుద్ధమే. మరి, ఈ విషయంలో కంగనాకు కేంద్రం ఎటువంటి సమాధానం ఇస్తుందో చూడాలి.
ప్రైమ్ మినిస్టర్ ఇందిరా గాంధీ జూన్ ,1975 నుండి మార్చ్, 1977వరకు అంటే దాదాపు 21నెలలపాటు సాగే సుదీర్ఘ ఎమర్జెన్సీని విధించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa