ఫిఫా ప్రపంచకప్-2022 ముగింపునకు వచ్చేసింది. ఫ్రాన్స్, అర్జెంటీనా దేశాలు ఫైనల్ కు చేరాయి. నేడు జరిగే ఫైనల్లో ప్రపంచ కప్ ను ఏ దేశం ముద్దాడుతుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఫైనల్స్ ముందు అదిరిపోయే ఈవెంట్లతో అలరించడానికి ఫిఫా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా బాలీవుడ్ నటి నోరా ఫతేహి డ్యాన్స్ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఫైనల్ పోరు ముందు నోరా తన డ్యాన్స్, అందంతో ఫుట్ బాల్ అభిమానులను అలరించనుంది. దీనికోసం నోరా ఫతేహి ఇప్పటికే ఖతార్ చేరుకుందని సమాచారం.