జేమ్స్ క్యామరన్ అద్భుత సృష్టి అవతార్2 ప్రపంచవ్యాప్తంగా 160 భాషల్లో విడుదలైంది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు మైమరచి చూస్తున్నారు. కోలీవుడ్‌లో పలువురు సినీ ప్రముఖులు అవతార్ – 2 చిత్రాన్ని మొదటి రోజునే చూడడానికి ఆసక్తి కనబరచడం మరో విశేషం. ఈక్రమంలో స్టార్ నటుడు ధనుష్ తన ఇద్దరు పిల్లలు లింగా, యాత్రలతో కలిసి అవతార్ ది వే ఆఫ్ వాటర్ చిత్రాన్ని వీక్షించారు. ధనుష్ శనివారం అవతార్ –2 చిత్రం గురించి తన ట్విట్టర్లో ఇట్స్ అవతార్ డే అని పేర్కొనడం మరో విశేషం.