క్రేజీ హీరోయిన్ సమంత తో కలిసి ఫుల్ లెంగ్త్ రొమాంటిక్ లవ్ స్టోరీ "ఖుషి" లో నటిస్తున్నారు హీరో విజయ్ దేవరకొండ. సమంత అనారోగ్యం కారణంగా ఈ మూవీ షూటింగ్ అంతకంతకూ ఆలస్యమవుతూ వస్తుంది.
ఈ నేపథ్యంలో విజయ్ వేరే సినిమాను చెయ్యాలని చూస్తున్నారట. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తో విజయ్ సినిమా చెయ్యబోతున్నాడని, ఆ సినిమాకు సూర్య దేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ ప్రాజెక్ట్ ను మరి కొన్ని రోజుల్లో విజయ్ పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నారని టాక్. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ అప్డేట్ కూడా రాబోతుందట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa