RRR సినిమాకు ఇంటర్నేషల్ లెవెల్లో చాలా మంచి గుర్తింపు రావడంతో, రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంకా ఆరంభం కాకుండానే ప్రపంచమంతటా బిగ్ బజ్ ఏర్పడింది. చూస్తుంటే, ఈ సినిమాతో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు పాన్ ఇండియా కాదు.. ఒకేసారి పాన్ వరల్డ్ లెవెల్ కి దూసుకుపోయేటట్టు కనిపిస్తున్నారు.
RRR తదుపరి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా ఉంటుందని రాజమౌళి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా 2023 మార్చిలో పట్టాలెక్కబోతుందని అంటున్నారు..మరి ఈ విషయంపై క్లారిటీ రావలసి ఉంది.
తాజా బజ్ ప్రకారం, ఈ సినిమాలో మహేష్ తండ్రి పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని తెలుస్తుంది. సో, ఆ పాత్రకు వరల్డ్ వైడ్ ఆడియన్స్ కు సుపరిచితుడైన నటుడైతే బాగుంటుందని చిత్రబృందం ఆలోచిస్తున్నారట. ఈ పాత్ర కోసం జక్కన్న సీనియర్ బచ్చన్ అమితాబ్ ను అనుకుంటున్నారని టాక్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa