కార్తీక్ దండు డైరెక్షన్లో మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న "విరూపాక్ష" మూవీ టైటిల్ గ్లిమ్స్ రీసెంట్గానే విడుదలై, ఆడియన్స్ అటెన్షన్ ను గ్రాస్ప్ చేసింది. తారక్ వాయిస్ ఓవర్ ఇచ్చిన ఈ గ్లిమ్స్ వీడియో సినిమాపై చాలా మంచి అంచనాలను ఏర్పరిచింది. పోతే, విరూపాక్ష మూవీ తో పాన్ ఇండియా బరిలోకి అడుగుపెట్టబోతున్నారు హీరో సాయిధరమ్ తేజ్. ఈ నేపథ్యంలో టైటిల్ గ్లిమ్స్ వీడియో లేటెస్ట్ గా హిందీ, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలైంది. మరి, ఇతర భాషల్లో ఈ మూవీ టైటిల్ వీడియోకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అజనీష్ లోక్ నాధ్ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా భాషల్లో ఏప్రిల్ 21, 2023లో ఈ సినిమా విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa