విజువల్ వండర్ ‘అవతార్-2’ కోసం ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. జేమ్స్ కామెరాన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఈనెల 16న ప్రపంచ వ్యాప్తంగా, దాదాపుగా 160 భాషల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇక ‘అవతార్ 2’ తెలుగు రైట్స్‌ని రూ.100 కోట్లకు దక్కించుకోవడానికి ఒకరిద్దరు నిర్మాతలు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ కుదర్లేదట. ‘ఓ హాలీవుడ్ డబ్బింగ్ సినిమాకి ఇంత రేటా’ అని మిగతా వారు ఆశ్చర్యపోయారు. ఇక ‘అవతార్ 2’ బడ్జెట్ మన లెక్కల్లో దాదాపుగా రూ.7,500 కోట్ల రూపాయలు. ప్రపంచ చలన చిత్ర చరిత్రలో అత్యంత ఖరీదైన చిత్రమిదే. ‘అవతార్’ కోసం రూ.1200 కోట్లు ఖర్చు పెడితే.. రూ.23000 కోట్ల ఆదాయం ఆర్జించింది.