మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి ఈ ఏడాది జీవితాంతం గుర్తుండిపోతుంది. ఎందుకంటే, RRR తో పాన్ ఇండియా సెన్సేషనల్ హిట్ ను అలానే వరల్డ్ వైడ్ క్రేజ్ ను సొంతం చేసుకుని ప్రొఫెషనల్ గా ఒక మెట్టు పైకెక్కిన చరణ్ ఈ ఏడాదిలోనే తండ్రి పదవికి అర్హత సాధించి మెమొరబుల్ గా ఈ ఏడాదికి ముగింపు పలకబోతున్నారు.
రామ్ చరణ్, ఉపాసన తల్లి తండ్రులు కాబోతున్నారని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి గారు ట్వీట్ చేసారు. దీంతో ఈ ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.
2012లో పెళ్లి చేసుకున్న చరణ్, ఉపాసన దాదాపు పదేళ్లకు పైబడిన తరవాత 2022లో పేరెంట్స్ అవబోతుండడంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa