షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న పఠాన్ మూవీ నుండి కొంతసేపటి క్రితమే ఫస్ట్ సింగిల్ గా బేషరం రంగ్ వీడియో సాంగ్ రిలీజ్ అయ్యింది. ఈ పాటలో దీపికా బికినీ ట్రీట్ కుర్రకారుకు పెద్ద బహుమతి అనే చెప్పాలి. ఇక, ఆమె సూపర్ హాట్ లుక్స్, అమేజింగ్ డాన్స్ మూవ్మెంట్స్ ..కనురెప్ప వెయ్యనియ్యకుండా చేస్తాయి. విశాల్ శేఖర్ స్వరపరిచిన ఈ పాటను శిల్ప రావు, కెరలిసా మోంటేరియ ఆలపించారు. కుమార్ లిరిక్స్ అందించారు.
సిద్దార్ధ్ ఆనంద్ డైరెక్షన్లో సూపర్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ భాషలలో వచ్చే ఏడాది జనవరి 25న థియేటర్లలో విడుదల కాబోతుంది. జాన్ అబ్రహం కీ రోల్ లో నటిస్తున్నారు. యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa