ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'వాల్తేరు వీరయ్య' లో రవితేజ.. టీజర్ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Mon, Dec 12, 2022, 11:54 AM
చిరంజీవి హీరోగా నటిస్తున్న 'వాల్తేరు వీరయ్య' లో రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. సోమవారం ఈ సినిమా నుంచి రవితేజ లుక్ ను విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో రవితేజ ఓ సిలిండర్ కు గొడ్డలి పట్టుకొని ఉన్నాడు. ఈ సందర్భంగా ఈ పోస్టర్ ను చిరంజీవి ట్వీట్ చేస్తూ 'అతని బ్యాక్ గ్రౌండ్ - కేవలం హార్డ్ వర్క్, అతని సపోర్ట్ - ప్రేమించే మాస్' అని పేర్కొన్నారు. బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నాడు.   







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa