అనుపమ పరమేశ్వరన్, నిఖిల్ జంటగా నటించిన '18 పేజెస్' చిత్రం ఈ నెల 23 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని ఏడురంగుల వాన పాటను చిత్రబృందం ఆదివారం విడుదల చేసింది. ఈ పాటను ఆవిష్కరించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అనుపమ పరమేశ్వరన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "అనుపమను చూస్తే నాకు ఇలాంటి కూతురు ఉంటే బాగుండు అనిపిస్తుంది. అంత మంచి అమ్మాయి తను. తనలో ఎలాంటి నటన లేకుండా చాలా ట్రాన్స్ పరేంట్ గా ఉంటుంది. తన మనసులో ఏం ఉంటుందో అదే మొహంలో కనిపిస్తుంది. ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. అందుకే అనుపమ అంటే చాలా ఇష్టం" అని ఆయన చెప్పుకొచ్చారు.