బాలీవుడ్ సీనియర్ నటుడు అమీర్ ఖాన్ తన కార్యాలయంలో పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో ఆయన మాజీ భార్య కిరణ్ రావ్ సైతం పాల్గొన్నారు. అమిర్, కిరణ్ కలిసి హారతి ఇచ్చారు. అమీర్ ఖాన్ ఈ పూజలు ఎందుకు నిర్వహించారో కారణాలు తెలియరాలేదు. అమిర్ ఖాన్ ప్రొడక్షన్ హౌజ్‌కు చెందిన సిబ్బంది కూడా ఈ పూజలో పాల్గొన్నారు. లాల్ సింగ్ చద్దా డైరెక్టర్ అద్వైతి చందన్ ఈ పూజలకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కాగా, ఏడాది తర్వాతే యాక్టింగ్ చేస్తానని ఇటీవలే అమీర్ ఖాన్ ప్రకటించిన విషయం తెలిసిందే.