కొద్దిరోజులుగా మంచు మనోజ్ సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. తనదైన నటన, అభినయంతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మనోజ్, రొటీన్‌కు విభిన్న సినిమాలు చేసి అలరించాడు. మనోజ్ తిరిగి సినిమాల్లోకి రావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈయన ఫోటో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. బ్లాక్ అండ్ వైట్‌లో మనోజ్ పోస్ట్ చేసిన ఫోటో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే అది సినిమాలో లుక్ అంటూ ప్రచారం జరుగుతుంది. మరీ దీనిపై మనోజ్ స్పందిస్తాడో లేదో చూడాలి.