"జీరో" తరవాత నాలుగేళ్ళ విరామం తీసుకున్న బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ వచ్చే ఏడాది "పఠాన్" గా ప్రేక్షకులను పలకరించబోతున్నారు.
రీసెంట్గా విడుదలైన పఠాన్ టీజర్ కు ప్రేక్షకాభిమానుల నుండి విశేషస్పందన దక్కింది.
సిద్దార్ధ్ ఆనంద్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్ గా, జాన్ అబ్రహం విలన్గా నటిస్తున్నారు. ఔటండౌట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 25న హిందీ, తమిళం, తెలుగు భాషలలో విడుదల కావడానికి రెడీ అవుతుంది.
ఈ నేపథ్యంలో పఠాన్ మూవీ నుండి షారుఖ్ ఖాన్ కొత్త స్టిల్ ఒకటి విడుదలైంది. జులపాల జుట్టు, చేతిలో పొడవాటి తుపాకి పట్టుకున్న షారుఖ్ లుక్ ఇంటెన్స్ గా ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో పఠాన్ న్యూ స్టిల్ వైరల్ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa