జెర్సీ, నేర్కొండ పర్వాయి, విక్రమ్ వేధ వంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న సౌత్ ఇండియన్ యాక్ట్రెస్ శ్రద్ధా శ్రీనాథ్ మరో ఇంట్రెస్టింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. దీపక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'విట్నెస్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ పాన్ ఇండియా మూవీలో సీనియర్ యాక్ట్రెస్ రోహిణి మొల్లేటి, సుబత్రా రాబర్ట్, షణ్ముగ రాజా, అళగం పెరుమాళ్, జి సెల్వ, రాజీవ్ ఆనంద్, తమిళరసన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషల్లో డిసెంబరు 9 నుండి సోనీ LIVలో ప్రసారం కానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రమేష్ తమిలమణి ఈ సినిమాకి సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa