తలపతి విజయ్ నటిస్తున్న 'వారిసు' మూవీ నుండి కొంతసేపటి క్రితమే మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. డిసెంబర్ 4న సాయంత్రం నాలుగు గంటలకు వారిసు మూవీ నుండి సెకండ్ సింగిల్ 'థీ తలపతి' లిరికల్ రాబోతుందని తెలుపుతూ స్పెషల్ పోస్టర్ ను విడుదల చెయ్యడం జరిగింది.
వంశీ పైడిపల్లి డైరెక్షన్లో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, రష్మిక మండన్నా జంటగా నటిస్తున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ ను దిల్ రాజు గారు నిర్మిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి వారిసు మూవీ తెలుగు, తమిళ భాషలలో గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.