ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రీ రిలీజ్ కు సిద్ధమైన పవర్ స్టార్ - పూరీల బ్లాక్ బస్టర్ మూవీ..!!

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 02, 2022, 05:42 PM

ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ ఫిలిం "బద్రి" మరోసారి థియేటర్లకు రాబోతున్నట్టు తెలుస్తుంది.


డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ డైరెక్టోరియల్ డెబ్యూ మూవీగా, 20 ఏప్రిల్,2000లో విడుదలైన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. అమీషా పటేల్, రేణు దేశాయ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కీరోల్ ప్లే చేసారు. "నువ్వు నందా ఐతే నాకేంటి ...నేను బద్రి..బద్రీనాధ్." అన్న డైలాగ్ సూపర్ పాపులర్ ఐన విషయం తెలిసిందే. తమ్ముడు వంటి చార్ట్ బస్టర్ ఆల్బమ్ తదుపరి పవన్ కళ్యాణ్ - రమణ గోగుల కాంబోలో వచ్చిన రెండో చిత్రమిది.


విజయ లక్ష్మి మూవీస్ బ్యానర్ పై టి త్రివిక్రమరావు నిర్మించిన ఈ చిత్రం ఈనెల 30వ తేదీన రీ రిలీజ్ కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa