ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాయిధరమ్ తేజ్ నెక్స్ట్ మూవీ...అఫీషియల్ లాంచ్..!!

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 02, 2022, 05:17 PM

యంగ్ మెగా హీరో సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం కార్తీక్ దండు డైరెక్షన్లో ఒక సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. చాలా సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెట్స్ పై ఉండగానే తేజ్ మరో నెక్స్ట్ మూవీని ఎనౌన్స్ చేసాడు.


సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో 16వ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీ ఈ రోజే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. కొత్త డైరెక్టర్ జయంత్ ఈ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం కాబోతున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర LLP బ్యానర్ పై BVSN ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాపినీడు సమర్పిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుందని మేకర్స్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa