విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటిస్తున్న స్పోర్ట్స్ బేస్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ "మట్టి కుస్తీ". చెల్లా అయ్యావు డైరెక్షన్లో తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో "గట్ట కుస్తీ" టైటిల్ తో విడుదల కాబోతుంది.
డిసెంబర్ 2న తెలుగు, తమిళ భాషలలో గ్రాండ్ రిలీజ్ కాబోతున్న ఈ మూవీ తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రెడీ అయ్యింది. రేపు సాయంత్రం ఆరింటి నుండి హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్స్ లో మట్టి కుస్తీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. విశేషమేంటంటే, ఈ సినిమాను నిర్మిస్తున్న మాస్ రాజా రవితేజనే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa