ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న చిత్రం "బేబీ". ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ యొక్క ట్రైలర్ రీసెంట్గానే రిలీజ్ అయ్యింది. సున్నితమైన భావోద్వేగాలతో కూడిన ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీకి ప్రేక్షకులు ఫుల్ ఫిదా అవుతున్నారు. దీంతో గత ఐదురోజుల నుండి బేబీ టీజర్ యూట్యూబులో టాప్ ట్రెండింగ్లో కొనసాగుతూ వస్తుంది. ఇప్పటివరకు ఈ ట్రైలర్ కు 4 మిలియన్ కు పైగా వ్యూస్, 111 కే లైక్స్ వచ్చాయంటే, బేబీ టీజర్ ప్రేక్షకులకు ఎంతలా నచ్చిందో అర్ధం అవుతుంది.
విరాజ్ అశ్విన్ , నాగబాబు, లిరిష, కుసుమ తదితరులు నటిస్తున్న ఈ సినిమాను సాయి రాజేష్ డైరెక్ట్ చేస్తుండగా, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై శ్రీనివాస కుమార్ నిర్మిస్తున్నారు. విజయ్ బుగ్లాని సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa