నితిన్, కృతిశెట్టి జంటగా నటించిన చిత్రం "మాచర్ల నియోజకవర్గం". MS రాజశేఖర్ రెడ్డి డైరెక్షన్లో ఔటండౌట్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ టాక్ తో రన్ అయ్యింది. భారీ వసూళ్లతో ఓపెనింగ్ కలెక్షన్స్ వచ్చినప్పటికీ మిక్స్డ్ టాక్ కారణంగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది.
ఆగస్టు 12న విడుదలైన ఈ సినిమా దాదాపు మూడు నెలల తరవాత డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ మేరకు డిసెంబర్ 9 నుండి జీ 5 ఓటిటిలో మాచర్ల నియోజకవర్గం స్ట్రీమింగ్ కాబోతుందని అధికారిక ప్రకటన విడుదలైంది.
శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో సముద్రఖని విలన్గా నటించారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa