అల్లు అర్జున్ ‘పుష్ప’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. అలాగే పుష్ప 2పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాలో లేడీ విలన్ గా కేథరిన్ ను తీసుకున్నారని తెలుస్తోంది. ఆ పాత్రలో కేథరిన్ ముందు పాజిటివ్ గా కనిపించి, చివరకు అల్లు అర్జున్ కు షాక్ ఇచ్చేలా ఉంటుందని టాక్. మొదటి పార్ట్ కు మించి సెకండ్ పార్ట్ లో ట్విస్టులు, యాక్షన్ సీన్స్ ఉన్నాయని సమాచారం.