ఫ్యాన్స్‌కి నటి మంజిమా మోహన్ షాకిచ్చారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లోని ఫొటోలన్నీ డిలీట్ చేశారు. ఇటీవలే నటుడు గౌతమ్ కార్తిక్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు ప్రకటించిన ఈ ముద్దుగుమ్మ తన పెంపుడు పిల్లి ఫొటో తప్ప మిగిలినవన్నీ తీసేశారు. దీనిపై స్పందిస్తూ ఇప్పటివరకు షేర్ చేసిన ఫొటోలను ఆర్కైవ్ చేశానని, తన ప్రయాణం మళ్లీ మొదలుపెడతానని చెప్పింది. కాగా, ఈ నెల 28న చెన్నైలో మంజిమా వివాహం జరగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa