మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ప్రత్యేక పాత్రలో నటించి అలకరించారు.కాగా, గాడ్ ఫాదర్ ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న వారికి నెట్ ఫ్లిక్స్ శుభవార్త చెప్పింది. ఈరోజు అర్ధరాత్రి 12 గంటల నుండి గాడ్ ఫాదర్ సినిమా ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ ట్విట్టర్ లో ప్రకటించింది.