ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలకృష్ణ రిలీజ్ చేయనున్న విశ్వక్ సేన్ "ధమ్కీ" ట్రైలర్ ..!!

cinema |  Suryaa Desk  | Published : Thu, Nov 17, 2022, 10:57 PM

నటసింహం నందమూరి బాలకృష్ణ గారి ఓటిటి టాక్ షో అన్ స్టాపబుల్ సెకండ్ ఎపిసోడ్లో యంగ్ హీరో విశ్వక్ సేన్ చీఫ్ గెస్ట్ గా వచ్చి ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. అప్పుడు బాలయ్య కోసం విశ్వక్ ఆ షోకు వెళ్తే, ఇప్పుడు విశ్వక్ కోసం బాలయ్య ధమ్కీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు. ఈ మేరకు కొంతసేపటి క్రితమే అధికారిక ప్రకటన వెలువడింది. రేపు సాయంత్రం ఏడింటికి హైదరాబాద్ లోని AMB సినిమాస్ లో ధమ్కీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగబోతుంది.


ఈ సినిమాకు విశ్వక్ సేన్ డైరెక్టర్ గా మాత్రమే కాక సహనిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో ఈ సినిమా విడుదల కాబోతుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa