అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన "ఓరి దేవుడా" సినిమా అక్టోబర్ 21న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా తమిళ రొమాంటిక్ కామెడీ "ఓ మై కడవులే" సినిమాకి అధికారక రీమేక్. ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ OTT ప్లాట్ఫారం ఆహా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆహాలో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. ఓటీటీలో ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
ఈ చిత్రం ప్రీమియర్ అయిన 40 గంటల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను సాధించడం ద్వారా OTTలో సెన్సేషన్ ని సృష్టించింది. ఈ విషయాన్ని OTT ప్లాట్ఫారం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రం లో విశ్వక్ సేన్ సరసన బాలీవుడ్ బబ్లీ బ్యూటీ మిథిలా పాల్కర్ జోడిగా నటిస్తోంది. ఈ ఫాంటసీ సినిమాలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటించారు.
ఈ సినిమాలో ఆశా భట్, రాహుల్ రామకృష్ణ మరియు ఇతరులు సహాయక పాత్రలు పోషించారు. లియోన్ జేమ్స్ ఈ సినిమాకి సౌండ్‌ట్రాక్‌లను అందించారు. పివిపి సినిమా మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa