కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ తన తదుపరి సినిమాని తలపతి విజయ్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో విజయ్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నట్లు సమాచారం. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్ లో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కీలక పాత్రలో కనిపించనున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ వార్తలపై ఇంకా మూవీ మేకర్స్ నుండి అధికారిక ప్రకటన రానప్పటికీ ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా అండ్ ఇంటర్నెట్ లో హల చల్ చేస్తుంది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించనున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa