టాలీవుడ్ స్టార్ హీరోలందరితో నటించి టాప్ హీరోయిన్ గా ఎదిగిన సమంత కోలీవుడ్ లోనూ తన హవా చాటింది. బ్యాక్ టు బ్యాక్ హిట్ మూవీస్ లో నటించి, తమిళనాడులో తన క్రేజ్ ను బాగా పెంచుకుంది. ఈ నేపథ్యంలో ఆమె నటించిన యశోద సినిమాకు తమిళ ప్రేక్షకులు విశేష ఆదరణను చూపిస్తున్నారు. ప్రేక్షకాభిమానుల కోరిక మేరకు మల్టీప్లెక్స్ లలో యశోద స్క్రీన్స్ ను పెంచుతున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు యశోద సినిమాను తమిళనాడులో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న శక్తి ఫిలిమ్ ఫ్యాక్టరీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
హరి శంకర్, హరీష్ నారాయణ్ ల డైరెక్షన్లో సరోగసీ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, మురళి శర్మ, రావు రమేష్, ఉన్ని ముకుందన్, సంపత్ రాజ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతం అందించారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa