ప్రముఖ తమిళ హీరో కార్తీ ఫేస్‌బుక్ ఖాతా హ్యాకింగ్‌కు గురైంది. ఈ విషయాన్ని హీరో కార్తీ స్వయంగా సోమవారం ట్విట్టర్‌లో తెలిపారు. టెక్నికల్ టీమ్ తన ఫేస్‌బుక్ ఖాతాను తిరిగి పునరుద్ధరించడానికి యత్నిస్తున్నట్లు వెల్లడించారు. ఆయన ట్వీట్‌కు అభిమానులు స్పందిస్తున్నారు. ఇక కార్తీ కీలక పాత్రలో నటించిన పొన్నియిన్ సెల్వన్-1, హీరోగా నటించిన సర్దార్ సినిమాలు ఇటీవల విడుదలై అలరించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa