ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నారు. సుకుమార్ డైరెక్షన్లో పక్కా కమర్షియల్ చిత్రంగా రూపొందనున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.
ఈ విషయం పక్కన పెడితే పుష్ప సీక్వెల్ మూవీ కారణంగా బోయపాటితో సినిమాను చేయలేకపోతున్నారు బన్నీ. గతంలో ఈ ఇద్దరి కలయికలో వచ్చిన సరైనోడు బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. దీంతో మరొక సినిమా ఈ ఇద్దరి కాంబోలో రావాలని ఫ్యాన్స్ కోరుకున్నారు. ఇందుకు సంబంధించి బోయపాటి బన్నీకి కథ చెప్పి, సినిమాకు కూడా ఒప్పించారు. కానీ, మధ్యలో అర్ధాంతరంగా పుష్ప సీక్వెల్ వచ్చి బోయపాటి ప్లాన్స్ ను చెడగొట్టింది.
బోయపాటి ఏ కథను చెప్పి బన్నీని ఇంప్రెస్ చేసాడో ఇప్పుడు అదే కథను హీరో రామ్ తో పాన్ ఇండియా మూవీగా తెరేక్కించబోతున్నారని టాక్. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa