తలపతి విజయ్ టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తో చేస్తున్న చిత్రం "వారిసు". తెలుగులో వారసుడు టైటిల్ తో వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ చిత్రంలో రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తుంది.
ప్రస్తుతం షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా కు సంబంధించి మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ బజ్ హల్చల్ చేస్తుంది. వారిసు ఆడియో లాంచ్ ఈవెంట్ ఈ నెల 24న చెన్నైలో జరగబోతుందని సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రాబోతుంది.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాపై తలపతి విజయ్ అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa