ఆల్రెడీ ఈరోజు థియేటర్లలో సందడి చేసిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం థియేట్రికల్ ట్రైలర్ రేపు మారేడుమిల్లి లో డిజిటల్ లాంచ్ కాబోతుంది. ఈ మేరకు చిత్రబృందం మారేడుమిల్లి గ్రామంలో రేపు సందడి చెయ్యబోతుంది. రేపు పదకొండున్నరకు రాజమండ్రి ఎయిర్పోర్ట్, పన్నెండింటికి దేవి చౌక్, సాయంత్రం నాలుగింటికి మారేడుమిల్లి హై స్కూల్ లను చిత్రబృందం విజిట్ చెయ్యనుంది.
అల్లరి నరేష్ 59వ చిత్రంగా రూపొందిన ఈ సినిమాకు AR మోహన్ డైరెక్టర్ కాగా, ఆనంది హీరోయిన్ గా నటించింది. వెన్నెల కిషోర్, ప్రవీణ్ కీలకపాత్రల్లో నటించారు. నవంబర్ 25న విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa