పొన్‌రామ్ దర్శకత్వంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి తన 46వ సినిమాని అధికారకంగా ప్రక్కటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ప్రసుతం 'VJS 46' అనే టైటిల్ తో పిలుస్తున్నారు. తాజాగా ఇప్పుడు, ఈ చిత్రానికి విరుచన్ అని టైటిల్ ని ఖరారు చేసినట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. డిసెంబర్ 2, 2022న సినిమాను విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ విషయం గురించి మూవీ మేకర్స్ నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఈ సినిమాలో విజయ్ సేతుపతి సరసన అనుకీర్తి వాస్ జోడిగా నటిస్తుంది. సన్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి డి ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa